A car plunged into a pond in Yadadri district: యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా చెరువులోకి దూసుకెళ్లింది కారు. 5 గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ చెరువులోకి దూసుకెళ్లింది ఓ కారు. ఈ కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఇక మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ కు చెందినవారుగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వంశీ గౌడ్, దిగ్నేష్, హర్ష, బాలు, వినయ్ ఈ ప్రమాదంలో మరణించారని పోలీసులు ధృవీకరించారు. హైదరాబాదులోని హయత్ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆరుగురు ప్రయాణిస్తే… మణికంఠ ఒక్కడే సేఫ్ గా ఉన్నాడు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఘోర రోడ్ ప్రమాదం
ఐదుగురు మృతియాదాద్రి జిల్లా జలాల్ పూర్ దగ్గర అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు
ఐదుగురు మృతి, మరొకరి పరిస్థితి విషమం
మృతులు హైదరాబాద్కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్లుగా పోలీసులు గుర్తింపు
పోలీసులకు సమాచారం అందించినా స్థానికులు
సంఘటన… pic.twitter.com/RqZAlSRRBM
— Pulse News (@PulseNewsTelugu) December 7, 2024