ప్రజాశాంతి పార్టీ చీఫ్ కే.ఏ.పాల్ పై కేసు నమోదు

-

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ పై తెలంగాణలో చీటింగ్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ జిల్లెలగూడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి కేఏ పాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ తరుపున పోటీ చేసేందుకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రూ.50 లక్షలు తీసుకుని, టికెట్ ఇవ్వకుండా మోసం చేశాడని పేర్కొన్నారు.

ఇందులో రూ. 30 లక్షలు ఆన్ లైన్లో.. కేఏ పాల్ కి చెల్లించానని, మిగిలిన రూ.20 లక్షలు పలు దఫాల్లో ఇచ్చానని తెలిపాడు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేఏ పాల్ పై  కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version