బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ కు సుప్రీంకోర్టులో ఊరట..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలైకు వాయిదా వేసింది. కాగా, 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హై కోర్టు ప్రకటించింది. ఫోర్జరీ సంతకాలతో దండె విఠల్ తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దండె విఠల్ ఎన్నిక అక్రమని, ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. ఎన్నిక రద్దు చేయడంతో పాటు దండె విఠల్కు న్యాయస్థానం రూ.50 వేల ఫైన్ విధించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును ఎమ్మెల్సీ విఠల్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపటన ధర్మాసనం.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక వివాదంలో విరల్కు బిగ్ రిలీఫ్ లభించినట్టైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version