సంక్రాంతి పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారును ఢీ కొట్టింది ఓ లారీ. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కారులో కాగజ్ నగర్ కు బయలుదేరారు మెకానికల్ ఇంజనీర్ అక్కు రాజు, అతడి భార్య. అయితే.. అదే సమయంలో అతివేగంతో కారును ఢీ కొట్టింది ఓ లారీ.
దీంతో ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిపోయాయి కారు భాగాలు. ఈ ప్రమాదంలో మెకానికల్ ఇంజనీర్ అక్కు రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. మెకానికల్ ఇంజనీర్ అక్కు రాజు భార్య మృతి చెందిందని అంటున్నారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
సంక్రాంతి పండుగ పూట విషాదం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కారులో కాగజ్ నగర్ కు బయలుదేరిన మెకానికల్ ఇంజనీర్ అక్కు రాజు, అతడి భార్య
అతివేగంతో కారును ఢీ కొట్టిన లారీ
ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిపోయిన కారు… pic.twitter.com/hDPMvFQUc0
— BIG TV Breaking News (@bigtvtelugu) January 14, 2025