తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో లగచర్లకు వామపక్ష నాయకులు వెళుతున్నారు. తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో సీపీఎం రాష్ట్ర కార్యాలయం నుండి లగచర్లకు వామపక్ష నాయకుల బృందం బయలుదేరింది. దింతో లగచర్లకు వామపక్ష నాయకులును వెళ్లనిస్తారా ? లేదా ? అనేది అందరిలోనూ టెన్షన్ ఉంది.
కాగా, లగచర్ల ఘటనలో రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అనే మొక్కను మొలవనియ్యని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఏమి అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. విజయోత్సవాలు జరుపుకునేంత స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన లేదని కామెంట్ చేశారు. రైతులను మోసం చేయడం, రైతుల భూములను లాక్కోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందేనని అన్నారు.