బీఆర్ఎస్ పార్టీ నేతలకు వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా మానుకోట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మరో కేసు నమోదైంది. తమ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారని ఓ మహిళ హనుమకొండలోని సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.హంటర్ రోడ్డు దుర్గాదేవి కాలనీలో తమకు గల 500 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అతని అనుచరులు బలవంతంగా లాక్కోవడానికి చూస్తున్నారని ఆరోపించింది.
తనకు పసుము కుంకుమల కింద వచ్చిన ఇంటి స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే అనుచరులు కబ్జాకు ప్రయత్నించడమే గాక..ఇదేమిటని అడిగిన తమపై దాడి చేసి, రూ.లక్షా 20 వేల ఫోన్లు లాక్కొని, చంపుతామని బెదిరించి వెళ్లారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక ఆక్రమణకు గురి చేసిన స్థలంలోని రూ.3 లక్షల విలువ చేసే కంటైనర్ హోమ్‌తో పాటు ఇతర వస్తువులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక శంకర్ నాయక్, అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని వెంటనే వారిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరారు.