తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు

-

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఐఏఎస్ గా పని చేసిన  భూసాని వెంకటేశ్వరరావు సారథ్యంలో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పై తెలంగాణ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

వేంకటేశ్వరరావు సహాయకుడిగా ఐఎఫ్ఎస్ అధికారి బి.సైదులును నియమించారు. హై కోర్టు ఆదేశాలతో డెడికేటెడ్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల ప్రాతిపదికన సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా.. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే డేడికేటెడ్ కమిషన్ ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version