కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ..!

-

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా సూటికల్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్ త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను కోరారు. నైపర్ సంస్థ గడిచిన ఆరేళ్లుగా ఆగిపోయిందని.. దానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే విషయం పై చర్చించారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. నైపర్ సంస్థకు భూమితో పాటు అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 

దాదాపు 30వేల నుంచి 40వేల కోట్లు ఫార్మా ఎగుమతులు విశాఖ కేంద్రంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. వీటికి అనుగుణంగా నైపర్ ని విశాఖపట్టణంలో ఏర్పాటు చేస్తే.. బాగుంటుందని కేంద్ర మంత్రికి చెప్పానని వెల్లడించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి చేయాల్సిన ఆరోగ్య పరీక్ష కేంద్రాలను ఉత్తరాంధ్రలో కానీ.. రాయలసీమలో కానీ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version