BREAKING : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక..తెలంగాణలో తొలి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం రాలేదనే మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. డోర్నకల్ పరిధిలోని ఎర్రమట్టి తండాకు చెందిన భూక్య వినయ్ (23) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు.
కొన్ని పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడం, మళ్ళీ కోచింగ్ తీసుకునేందుకు డబ్బులు లేక ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి, వ్యవసాయ బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక..తెలంగాణలో తొలి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కాస్త ఆసక్తికరంగా మారింది.