తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేసించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌పై కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించి..కీలక ఆదేశాలు జారీ చేశారు.
క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించిన భట్టీ….. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విందుకు సీఎం రేవంత్ హాజరవుతారన్నారు.. నియోజకవర్గానికి వెయ్యి మందికి చొప్పున గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ చేస్తామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 200 ప్రాంతాల్లో 500 మందికి క్రిస్మస్ బహుమతుల పంపిణీ చేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
క్రిస్మస్ వేడుకలు నిర్వహణ యాక్షన్ ప్లాన్ గురించి మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమెర్ జలీల్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. ఇక ఈ సమీక్ష లో ఎం.డి కాంతి వెస్లీ, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీ మహంతి, రాచకొండ సిపీ సుధీర్ బాబు తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.