హైదరాబాద్ మెట్రో కు అరుదైన గౌరవం, మంచి గుర్తింపు లభించింది. ప్రఖ్యాత హార్వార్డ్ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించి.. హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ మెట్రో ప్రాజెక్ట్ లో ఇది ఒకటిగా గుర్తించింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ నేపఝథ్యంలో మొదట ఎన్నో అడ్డంకులు ఎదుర్కొందని హార్వార్డ్ తెలిపింది.
భూసేకరణ, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా నిరసనలు వంటి ప్రధాన సవాళ్లను అధిగమించడంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దార్శనిక నాయకత్వాన్ని వ్యూహాత్మక అమలును ఈ అధ్యయనం ప్రశంసించింది. మెట్రోను భారతదేశంలోని అత్యుత్తమ మెట్రో వ్యవస్థలల్లో ఒకటిగా మార్చడానికి కీలకమైన నిర్ణయాలు, పరిపాలన సామర్థ్యం దోహదపడ్డాయి. మెట్రో ప్రాజెక్ట్ ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా చేశాయని హార్వార్డ్ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ లో వినూత్న ఆర్థిక విధానాలు, ఉన్నత ఇంజనీరింగ్ పరిష్కారాలు సమర్థవంతమైన చర్చల వ్యూహం ద్వారా అవరోధాలను అధిగమించారు.