కొండా సురేఖ కేసులో ట్విస్ట్‌..రేపు కోర్టుకు రానున్న నాగార్జున

-

కొండా సురేఖ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రేపు కోర్టుకు రానున్నారట అక్కినేని నాగార్జున. ఇవాళ నాగార్జున పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున తరపున వాదనలు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు.

A twist has taken place in the Konda Surekha case. Akkineni Nagarjuna is coming to the court tomorrow

దీంతో రేపు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు పేర్కొంది. ఈ తరుణంలోనే.. రేపు కోర్ట్ కు హాజరు కానున్నారు అక్కినేని నాగార్జున. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని రేపే నమోదు చేయాలని కోరారు నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది మనోరంజన్ కోర్టు. ఇది ఇలా ఉండగా… మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రూ.100 కోట్ల పరువు నష్టం దావా కేసు వేశారు అక్కినేని నాగార్జున.

Read more RELATED
Recommended to you

Exit mobile version