Telangana: దీపావళి రోజున తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

-

Telangana: తెలంగాణ రాష్ట్రంలో దీపావళి రోజున తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న కారుని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్సు. దీంతో ఈ రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతులు నకిరేకల్ కు చెందిన దంపతులు బొబ్బల నర్సిరెడ్డి, సరోజమ్మగా గుర్తించారు.

accident in telangana state

అటు జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందారు. దేవరుప్పుల మండలం చింతబావి తండ వద్ద యాక్సిడెంట్ లో వ్యక్తి మరణించగా ఇద్దరు వ్యక్తులు సీరియస్ గా ఉన్నారు. దీంతో సీరియస్‌ గా ఉన్న వ్యక్తిని జనగామ ఏరియా ఆసుపత్రికి పోలీసు వాహనంలో తరలించారు దేవరుప్పల ఎస్సై సృజన్ కుమార్. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. దీపావళి పండుగ రోజే ఈ ప్రమాదాలు జరుగడం విచారకం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version