Hyderabad : ₹ 7 కోట్ల ఆభరణాల చోరీ కేసులో నిందితుడి అరెస్టు

-

హైదరాబాద్​లో ఈనెల 17న రాధిక అనే నగల వ్యాపారి వద్ద డ్రైవర్​గా పనిచేస్తున్న శ్రీనివాస్ రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి శ్రీనివాస్ కోసం వెతకడం ప్రారంభించారు. సీసీటీవీ, సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎట్టకేలకు ఖమ్మం జిల్లాలో ఏపీ సరిహద్దు వద్ద అతడిని పట్టుకున్నారు. శ్రీనివాస్​ను అరెస్టు చేసిన ఎస్సార్​నగర్ పోలీసులు అతడిని హైదరాబాద్​కు తరలిస్తున్నారు. నగరానికి తీసుకువచ్చిన తర్వాత అతడిపై విచారణ జరపనున్నట్లు తెలిపారు.

నగల వ్యాపారి రాధిక.. అనూష అనే మహిళకు నగలు డెలివరీ చేయమని ఈనెల 17న డ్రైవర్ శ్రీనివాస్, సెల్స్​మెన్ అక్షయ్​లను పంపించింది. ఈ క్రమంలో అక్షయ్ అనూషకు నగలు అందించడానికి లోపలికి వెళ్లగా కారులోనే వేచి ఉన్న డ్రైవర్ శ్రీనివాస్​.. పక్కాప్లాన్ ప్రకారం రూ.7 కోట్ల విలువైన మిగతా నగలు తీసుకుని పరారయ్యాడు. ఈ విషయం అక్షయ్ రాధికకు తెలపగా.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version