ప్రవళిక మృతి కేసులో నిందితుడు శివరాం రాథోడ్ అరెస్ట్

-

ప్రవళిక ఆత్మహత్య కేసు చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇది ప్రభుత్వ హత్య అని ప్రతిపక్షాలు… కాదు ఆమె ప్రేమ వివాహారం కారణంగానే ప్రవళిక మరణించిందని ప్రభుత్వం వెల్లడిస్తోంది. అయితే పోలీసులు మాత్రం ప్రవళిక ఆత్మహత్యకు అసలు కారణం ప్రేమ వ్యవహారమని ఇప్పటికే తెలిచారు.

Accused Sivaram Rathore arrested in Pravalika's death case
Accused Sivaram Rathore arrested in Pravalika’s death case

అలాగే ప్రవళిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు… ప్రవళికను వేధించిన శివరామ రాథోడ్ పై కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రవళిక హత్య కేసులో నిందితుడు అయినా శివరాం రాథోడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రవళిక మృతి తర్వాత పరారీలో ఉన్న శివరాం పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం శివరామ రాథోడ్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 13వ తేదీన రాత్రి హైదరాబాద్లోని హాస్టల్ లో ఆత్మహత్యకు ప్రవళిక పాల్పడ్డ సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news