కాంగ్రెస్ నిర్ణయాన్ని శిరసా వహిస్తా – అద్దంకి దయాకర్

-

Addanki Dayakar : కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంపై ఆ పార్టీ సీనియర్‌ నాయకులు అద్దంకి దయాకర్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం శిరసావహిస్తానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల చేసింది. మొత్తం ఐదుగురి పేర్లతో ఫైనల్‌ లిస్ట్‌ రిలీజ్‌ చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

పటాన్‌చెరులో నీలం మధు స్థానంలో కట్ట శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఇక అటు తుంగతుర్తిలో మందుల సామియెల్, సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్ లో ముజీబ్ షరీఫ్ పేర్లను ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. అయితే…నీలం మధు, అద్దంకి దయాకర్ ఇద్దరినీ నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. దీనిపై దయాకర్‌ మాట్లాడుతూ… అనేక ఈక్వెషన్ ల తర్వాత టికెట్ ఇచ్చారు అనుకుంటున్నానని చెప్పారు. సామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటా…కాంగ్రెస్‌ గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version