ఆదిలాబాద్ వాసులకు జిల్లా ఎస్పీ కీలక సూచనలు..!

-

రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. గత రాత్రి జాతీయ రహదారిపై గుడిహత్నూర్ మండలంలోని మేకల గండి వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. వాహనదారులు జాతీయ రహదారిపై అతివేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. సూచిక బోర్డులు, రంబుల్ ట్రిప్స్, మరిన్ని ప్రమాద బోర్డులు,ఎల్లో బ్లీంకింగ్ లైట్స్, వేగ నియంత్రణ బోర్డులు, ఉన్న ప్రదేశాలలో వాహన వేగాన్ని నియంత్రించాలని, జాతీయ రహదారిపై ఉన్న నిబంధనలు పాటించాలని సూచించారు.

ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి, అక్కడ నియంత్రణ మార్గాలను అన్వేషించి, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, జిగ్ జాగ్ పద్ధతులను, సాయంత్రం సమయాలలో వాహన తనిఖీలను నిర్వహిస్తుందని తెలిపారు. ఎస్పీ వెంట ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news