హుస్సేన్ సాగర్ చుట్టూ వాటిని కూల్చేయాలి..!

-

హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో ప్రభుత్వం అనుమతులు ఇచ్చి వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసింది. హుసేన్ సాగర్ హైదరాబాద్ నడి బొడ్డున ఉంది. అయితే బఫర్ జోన్ నిర్ధారణ బౌండ్రి ఏర్పాటు చేసి.. హద్దులు ఏర్పాటు చేయాలని ఇది ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న అంటూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పిజేఅర్ చెరువుల ఆక్రమణ పై ఉద్యమం, న్యాయ పోరాటం చేశారు. నీరు ఉంటేనే భూగర్భ జలం వృద్ధి చెందుతుంది. ఈ విషయంలో సీఎం చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న అన్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చడానికి అసెంబ్లీ లో చర్చ పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు చేపట్టలేదు. హుస్సేన్ సాగర్ చుట్టూ బఫర్ జోన్ పరిధిలో ఉన్న అన్నింటినీ కూల్చి వేయాలి. ఇదే తరహాలో అన్ని జిల్లాల వారీగా చర్యలు చేపట్టాలని కోరుతున్న అని లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version