తెలంగాణ ఉద్యమం తరువాత మళ్లీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాటు చేశామని.. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం. మేనిఫెస్టోలో పీఆర్సీ, టీఏ, డీఏ అని అన్నారు కానీ 9 నెలలు అయిన ఇంకా ఇవ్వలేదు.. ఇప్పటికీ 4 డీఏలు ఇవ్వలేదు. సీఎం మమ్మల్ని కలిసి, మా సమస్యలు పరిష్కరిస్తానన్నారు.. కానీ ఇప్పుడు ఆయన కలిసే పరిస్థితిలో లేడు.
ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఒకటవ తేదీన జీతాలు అంటున్నారు. కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ లకు ఒకటవ తేదీన జీతాలు రావట్లేదు. 15 రోజుల్లో మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.. మా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ హెచ్చరిక చేసింది. జేఏసీ ఇలాగే కొనసాగుతుందో లేదో అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.