Agitated students of Koti Womens College: కోఠి మహిళా కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నుంచి ఆందోళనకు దిగారు విద్యార్థులు. కోఠి మహిళ కళాశాలలో ఆందోళనకు దిగారు విద్యార్దినిలు. కోఠి మహిళ విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ… ఆందోళనకు దిగారు విద్యార్థులు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళ విశ్వవిద్యాలం గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని చెబుతున్నారు విద్యార్థులు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయం గా పేరు మార్చిందని తెలిపారు.
తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీ లో చేర్చకపోవడం వల్ల తమ ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్ ఇస్తారని ఆందోళన చేస్తున్నారు. తమ భవిషత్తు అయోమయంగా మారిందని అంటున్నారు విద్యార్ధినిలు. ఇక దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకొని , యూజీసీ లో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.