ఆకునూరి మురళిపై RS ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఆకునూరి మురళి ఎన్నికల ముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడు తున్నారని… విద్యా కమీషన్ ఏమి చేస్తుందో తెలియట్లేదని ఆగ్రహించారు. రేవంత్ రెడ్డి ని కాపాడేందుకు ఆకునూరి మురళి పని చేస్తున్నారు… ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు చూసి విద్యా కమీషన్ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. విద్యా కమీషన్ ఏమి చేస్తుందో ఆకునూరి మురళి నే అడగాలన్నారు
.
ఇక అటు బీర్లు, బిర్యానీలల గురించి వీడియోలు చేసే మీకు…ఏం తెలుసు బాధలు అంటూ కొండా సురేఖపై RSP ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో RS ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీకు..విషాహారం తిని తల్లడిల్లుతున్న విద్యార్థుల బాధ అర్థమవుతుందా? అని ప్రశ్నించారు. ఒక మాతృమూర్తిగా ‘కుట్ర’ జరిగిందని మీరు మాట్లాడాల్సిన మాటలేనా? అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొండా సురేఖ స్థాయి కి నేను దిగజారదల్చుకోలేదని… మీరు భవిష్యత్ లో తెలంగాణ లో మాట్లాడ కండి అంటూ హెచ్చరించారు. మీరు మాట్లాడిన మాటలు వినలేక తెలంగాణ లో మహిళలు తల దించు కుంటున్నారని చురకలు అంటించారు.