VH పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. VH ఇంట్లో మున్నూరు కాపు ల సమావేశంపై ఏఐసీసీ సీరియస్ అయింది. ప్రతిపక్ష పార్టీలను పిలిచి …ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ప్రశ్నించింది. బీసీ కుల గణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి… విమర్శలా..? అంటూ వీహెచ్ పై గరం అయింది కాంగ్రెస్ పార్టీ. అయితే..దీనిపై వీహెచ్ స్పందించారు.
నేను పార్టీ మనిషిని అని… పార్టీ కి నష్టం చేసే పని చేయనని తెలిపారు. ఒకరిద్దరికి కోపం రావచ్చు…. నిన్న మీటింగ్ లో సిఎం నీ…ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదన్నారు. జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందని అన్నారని వెల్లడించారు. దాని మీద సిఎం తోనే మాట్లాడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత మున్నూరు కాపు సభ తేది ప్రకటిస్తామని వివరించారు. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.