హైదరాబాదులో దారుణం జరిగింది. బీటెక్ చదివే విద్యార్థి మిస్సింగ్ అయ్యాడు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కార్రిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు అజితేష్. 20 సంవత్సరాలు ఉన్న అజితేష్… రెండు రోజుల కిందట నుంచి కనిపించడం లేదని తెలుస్తోంది. మార్చి 29వ తేదీన వారాసిగూడలో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నట్లు అజితేష్ వెల్లడించారు.

అదేరోజు అజితేష్ కు ఫోన్ చేశాడు తండ్రి రామ కృష్ణ. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం తో అజితేష్ స్నేహితులను అడిగారు తండ్రి. అజితేష్ ఆచూకీ తెలియక పోవడంతో… స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మేడ్చల్ పోలీసులు. ఈ మిస్సింగ్ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.