మూసి పరిసరాల ప్రాంతాలలో ఇల్లు, ఇతర నిర్మాణాలు చేపట్టే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. మూసి పరిసరాలలో నిర్మాణాల నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది.

ఈ కమిటీల్లో సభ్యులుగా మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జే ఎం డి, డిటిసిపి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ చీఫ్ ప్లానర్, హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ ఉన్నారు. మూసి పరిసరాలకు 50 మీటర్ల వరకు బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఈ సందర్భంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 50 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా… లేదా… అక్రమంగా నిర్మించిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.