తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీజు గడువు తేదీలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. అయితే… ఇవాల్టి నుంచి అనగా అక్టోబర్ 26వ తేదీ నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ స్టార్ట్ అయ్యి… నవంబర్ 14వ తేదీ వరకు ఎలాంటి జరిమానా లేకుండా విద్యార్థులు ఫీజును చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది.
అనివార్య కారణాల వల్ల నవంబర్ 14వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించని స్టూడెంట్స్ నవంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు 100 రూపాయల జరిమానాతో ఫీజు కట్టే అవకాశాన్ని కల్పించింది. ఇక నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు 500 రూపాయల ఫైన్ తో, అలాగే డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు వెయ్యి రూపాయలతో, డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు 2000 రూపాయల జరిమానా ఫీజు విద్యార్థులు చెల్లించవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ రూల్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు నడుచుకోవాల్సి ఉంటుంది.