నేడు, రేపు మాత్రమే ఖైరతాబాద్ గణేష్ దర్శనం..సోమవారం దర్శనాలు బంద్‌ !

-

ఖైరతాబాద్ గణేష్ భక్తులకు అలర్ట్‌. నేడు, రేపు మాత్రమే ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఉంటుంది. సోమవారం దర్శనాలు లేవని అధికారులు ప్రకటించారు. మంగళవారం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. దీంతో ఖైరతాబాద్…భక్త జన సంద్రమైంది.

Increased crowd of devotees at Khairatabad Bada Ganesh

వీక్ ఎండ్ కావడం తో పాటు రేపటి వరకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉండడం తో ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటేత్తారు. అటు ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఖైరతాబాద్, లక్డి కపుల్ మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతి రూపం లో ఖైరతాబాద్ గణేషుడి దర్శనం ఇస్తాడు. 1954లో ఖైరతాబాద్ గణేష్ ప్రస్థానం మొదలైంది. ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవాలు మొదలై 70 ఏళ్ళు అవుతున్న సందర్బంగా 70 అడుగుల ఎత్తుల్లో మట్టి తో ఖైరతాబాద్ గణేష్ ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ రైల్వే ట్రాక్, ఐమాక్స్ , లక్డీ కపూల్ నుంచి వచ్చి ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version