ఈ నెలాఖరులోగా వారి ఖాతాల్లో డబ్బులు జమ : మంత్రి తుమ్మల

-

ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ తప్పకుండా అందరికీ పూర్తి చేసి తీరుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు. రేషన్ కార్డులు లేని 3 లక్షల మంది రైతుల వివరాలను గ్రామాల వారీగా అధికారులు పరిశీలిస్తున్నారని, ఈ నెలాఖరులోగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేసి రుణమాఫీ చేస్తామని స్పష్టంచేశారు. రుణమాఫీ పూర్తయ్యాకే రైతు భరోసా డబ్బులు కూడా జమ చేస్తామని మంత్రి వెల్లడించారు.

ఇదిలాఉండగా, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎంరేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే,చాలా మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని ఫిర్యాదులు చేయగా.. ప్రభుత్వం టెక్నికల్ సమస్య వల్లే కొందరికి రుణమాఫీ కాలేదని తేల్చింది. మిగిలిన వారికి ఈ నెలాఖరులోగా చేస్తామని తాజాగా వ్యవసాయ మంత్రి తుమ్మల మరోమారు స్పష్టంచేశారు.కాగా,కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేసిందని, ఆరు గ్యారెంటీల అమలులో విఫలం అయ్యిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version