సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతీ ఒక్కరికీ స్వాగతం : సీఎం రేవంత్ రెడ్డి

-

వేల సంవత్సరాల నాటి చరిత్ర.. సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతీ ఒక్కరికీ స్వాగతం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్కు వద్ద టూంబ్స్‌ను సందర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆగాఖాన్ ట్రస్ట్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్దరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

శాతావాహనులు, కులీ కుత్ బ్ షాహీలు, ఇతరులు ఈ ప్రాంతాన్ని పరిశీలించాలని తెలిపారు. చార్మినార్, గోల్కొండ కోట, కుత్ బ్ షాహీ సమాదులు, వేయి స్థంబాల గుడి, రామప్ప, అలంపూర్ వంటి దేవాలయాల వంటి నిలయాలు వాస్తు అద్భుతాలను తెలంగాణ నిలయంగా ఉందన్నారు. శతాబ్దాలుగా హైదరాబాద్ గంగా-జమునా తెహజీబ్ గా పిలువబడుతూ.. బహుళ జాతుల సంస్కృతుల సామరస్యాన్ని సహజీవనాన్ని చూసిందన్నారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్కు, సెవెట్ టూంబ్స్ ఔట్స్ షాహిన్ రాజవంశం నైపుణ్యానికి గొప్పతనంగా నిలుస్తాయన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version