దాని కోసం వెంటనే టెండర్లు వేయాలి అంటూ CPM డిమాండ్..!

-

అంబర్ పేట కబేలాకు వెంటనే టెండర్లు వేయాలి. లీజు పొడగింపు ఆపాలి అని CPM డిమాండ్ చేసింది. అంబర్ పేట కబేలాను నిర్వహించే కాంట్రాక్ట్ పిరియడ్ ఏప్రిల్ 2024లో ముగిసినప్పటికీ టెండర్లు వేయకుండా లీజును పొడిగించడం అక్రమం. ఏప్రిల్ నుండి ఆరు నెలల పాటు పొడిగించిన జిహెచ్ఎంసి అధికారులు మరోసారి పొడిగించడానికి ప్రయత్నిస్తున్నారు. టెండర్లు వేయకుండా లీజ్ పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించింది.

2021 ఏప్రిల్ లో అన్మోల్ ట్రేడింగ్ కంపెనీ అల్ ఆహాద్ కంపెనీలతో కూడిన కన్సార్టియం తో మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్న జిహెచ్ఎంసి, 2024 ఏప్రిల్ కంటే ముందే టెండర్ ప్రక్రియ మొదలుపెట్టకుండా సమయం లేదంటూ లీజ్ పొడిగిస్తూ వెళ్తున్నారు. లీజ్ పొడిగింపు లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. గత కొన్నేళ్లుగా చెంగిచెర్ల కబేలాలో గత ప్రభుత్వం ఇదే రకమైన అక్రమాలకు పాల్పడింది, ఈ ప్రభుత్వం కూడా అంబర్ పేటలో అదే పద్ధతి కొనసాగిస్తున్నది. లీజ్ పొడిగింపు తక్షణమే ఆపాలని, టెండర్ ప్రక్రియని వెంటనే మొదలు పెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని CPM పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version