సన్న వడ్లకు బోనస్ ఒక మోసం : మహేశ్వర్ రెడ్డి

-

బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 30న రైతు హామీల సాధన దీక్ష చేపటనున్నట్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు. రుణమాఫీ పూర్తి చేయకుండానే సర్కార్ రైతులను మోసం చేస్తోంది. లక్ష రుణమాఫీకే గత సర్కార్ 19వేల కోట్లు ఖర్చు చేసింది. రూ.2 లక్షల రుణమాఫీకి దాదాపు 40వేల కోట్లు ఖర్చు అవుతాయ. ఇదే విషయాన్ని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటి వరకు కేవలం 17వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. ఇంకా రూ. 18వేల కోట్లు రుణమాఫీకి అవసరం అని మంత్రులు అంటున్నారు. ప్రభుత్వమేమో రుణమాఫీ పూర్తి అయింది అంటోంది. రూ. 17వేల కోట్లతో 2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం అయిందో వారే చెప్పాలి.

ఇక సన్న వడ్లకు బోనస్ అనడం, మోసం చేయడమే. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సర్కార్ మోసం చేస్తోంది. అన్నదాతలకు అండగా, హామీలు అమలు చేసేలా సర్కార్ పై ఒత్తిడి తెస్తాం. తెలంగాణలో దొడ్డు వడ్లనే రైతులు ఎక్కువగా పండిస్తారు. కేవలం 20శాతం మంది పండించే రైతులకే ప్రయోజనం. బోనస్ భారం తప్పించుకునేందుకే సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతుంది అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version