నారాయణపేట జిల్లా కోడంగ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఈ పథకాలను ప్రారంభించారు. లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గతంలో కోడంగల్ వివక్షతకు గురైందని తెలిపారు. అద్భుతమైన 4 సంక్షేమ పథకాలను ఇవాల కోడంగల్ నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని.. రాష్ట్ర ప్రజలకు ఇది శుభదినం అని చెప్పారు.
ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. పదేళ్ల తరువాత ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. భూమికి విత్తుకు ఎంత అనుబంధం ఉందో.. రైతుకు, కాంగ్రెస్ కి అంతే అనుబంధం ఉందని తెలిపారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.