అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 చిత్రం డిసెంబర్ 04న సంధ్య థియేటర్ లో ప్రదర్శించిన ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాట సందర్బంగా రేవతి అనే మహిళా మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హీరో అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, విచారణ అంటూ ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఇవాళ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని విచారించారు. సెంట్రల్ జోన్ డీసీపీ, ఏసీపీ రమేష్, ఇన్ స్పెక్టర్ రాజు నాయక్ విచారణ చేపట్టారు. ఈ తరుణంలోనే అడ్వొకేట్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడు రోజుల్లో హీరో అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుందని.. అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. తాను ఒక అడ్వకేట్ నని.. తనను పోలీసులు అనుమతివ్వడం లేదన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లగా.. పోలీసులు అనుమతించకపోతే.. ఆయన ప్లెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.