కాంగ్రెస్ రాహుల్‌ యాన్‌ 20 సార్లు ప్రయోగించినా సక్సెస్ కాలేదు : అమిత్ షా

-

ప్రధాని మోదీ చంద్రయాన్‌-3ని విజయవంతం చేశారని.. కాంగ్రెస్‌ మాత్రం రాహుల్‌ యాన్‌ను విజయంవంతం చేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాహుల్‌యాన్‌ను ఇప్పటికే 20 సార్లు ప్రయోగించినా… విజయంవంతం కాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్‌ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని.. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. లక్షన్నర కోట్లతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందని మండిపడ్డారు. కొల్లాపూర్‌లో విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడారు.

“నేటి కాంగ్రెస్‌ అభ్యర్థులంతా నిన్నటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. కాంగ్రెస్‌, బీఆర్ఎస్కు ఓటు వేయడమంటే.. అవినీతిపరులకు, మైనార్టీలకు వేసినట్లే. మిషన్‌ కాకతీయలో రూ.22 వేల కోట్ల అవినీతి జరిగింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజులో వేల కోట్ల అవినీతి జరిగింది. భూముల వేలంలో బీఆర్ఎస్ సర్కార్‌ రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడింది. ఉద్యోగ పరీక్ష పత్రాలు లీక్ చేసి భారీ అవినీతికి పాల్పడింది. అవినీతి బీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించి బీజేపీని గెలిపించాలి. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే.. తెలంగాణ ప్రజలను ఉచితంగా అయోధ్య తీసుకెళ్తాం.” అని అమిత్ షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version