రేపు ఆదిలాబాద్‌లో అమిత్ షా సభ

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌ ప్రారంభం అయింది. ఏ క్షణమైనా.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వచ్చే ఛాన్స్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి ఆగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. గతవారం ప్రధాని మోదీ తన పర్యటనలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

Amit Shah Sabha in Adilabad tomorrow

దీనికి కొనసాగింపుగా రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. స్థానిక డైట్ కాలేజీ గ్రౌండ్స్ లోని బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం సికింద్రాబాద్ లో జరిగే మేధావుల సదస్సులో పాల్గొని మేనిఫెస్టోలో చేరాల్సిన అంశాలపై సలహాలు తీసుకుంటారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ ఎన్నికలలో పాల్గొనే జాబితాను విడుదల చేసింనట్లు సమాచారం అందుతోంది.

అయితే కేవలం 38 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిందట బీజేపీ. ఈ జాబితా ప్రకారం.. కిషన్ రెడ్డి – అంబర్ పేట, విజయలక్ష్మి – ముషీరాబాద్, మర్రిశశిధర్ – సనత్ నగర్, ప్రభాకర్ – ఉప్పల్, రామచంద్రరావు – మల్కాజ్ గిరి, చింతల రామచంద్రారెడ్డి – ఖైరతాబాద్ , బూర నర్సయ్య గౌడ్ – ఇబ్రహీం పట్నం, ఈటల – హుజురాబాద్, బండి సంజయ్ – కరీం నగర్ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version