వరంగల్ జిల్లాకు కేటీఆర్…పరకాలకు బంద్ కు పిలుపు…!

-

 

హనుమకొండ జిల్లా పరకాల లో మంత్రి కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో రూ. 114 కోట్ల 65 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి కేటీఆర్‌. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రి కేటీఆర్ హెలికాప్టర్ ద్వారా పరకాల వ్యవసాయ మార్కెట్ చేరుకుంటారు మంత్రి కేటీఆర్‌. అనంతరం అక్కడ నుంచి నేరుగా నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభించి, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ గృహలక్ష్మి, దళిత బందు,2bhk లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలు అందజేయనున్నారు.

BJP Bandh Call In Parakala

పరకాల పశువుల సంతలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లడతారు. హనుమకొండ జిల్లా పరకాల లో మంత్రి కేటీఆర్ నేడు పర్యటించనున్న తరుణంలో.. బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ సభ సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో ఇవాళ పరకాలకు బంద్ కు పిలుపు నిచ్చారు. పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఈ పిలుపునిచ్చారు. బంద్ లో వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలంటూ సూచనలు చేశారు బీజేపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version