కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈనెల 29న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు తాజాగా తెలిసింది. ఈ నెల 29న పార్టీ ముఖ్య నేతలతో సమావేశంతో పాటు సామాజిక వర్గాలతో సమావేశమయ్యేందుకు ఆయన పర్యటన ఖరారైంది. కానీ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అమిత్ షా పర్యటన వాయిదా వేసినట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.
అయితే త్వరలోనే అమిత్ షా పర్యటన ఎప్పుడు ఉండేది తెలియజేస్తామని వెల్లడించాయి. ఇప్పటికే రాష్ట్రంలో అమిత్ షా పర్యటన పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈసారైనా షా పర్యటన ఉంటుందా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మరోవైపు తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి తమ కేడర్‌ను బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు రాష్ట్ర నేతల్లో ఇటీవల సమన్వయలోపం కనిపిస్తోంది. చాలా వరకు నేతల్లో అసంతృప్తి క్లియర్‌గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది.