అస్తిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేసిన రూపం నేటి తెలంగాణ తల్లి రూపం : అందెశ్రీ

-

గత పాలకులు అన్నట్లుగా అరుస్తున్నట్లుగా తెలంగాణ తల్లి లేదు. అస్తిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేసిన రూపం నేటి తెలంగాణ తల్లి రూపం అని అందెశ్రీ అన్నారు. బతుకమ్మ దేవత, ఆ దేవతను మరో దేవత నెత్తిన పెట్టుకుంటుందా. మానవ రూపంలో కిరీటం సరైనది కాదు. దేవత రూపంకు కిరీటం పెడతారు. అమ్మ రూపానికి కిరీటం ఉంటుందా .దేవత రూపం గుళ్లో పెట్టి పూజించు కోవాలి ..అమ్మ రూపాన్ని గుండెల్లో పెట్టి ఆరాధించాలి.

ఈ భూమిపైన ఏదైనా తల్లి అయితే కిరీటం పెట్టుకొని వస్తుందా. అమ్మకు ప్రతిరూపం మానవ దేహాల కు ప్రతిరూపంగా ప్రతి తెలంగాణ నాలుగు కోట్ల మంది గుండెల్లో పెట్టుకునే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. కిరీటాలు దేవతలు పెట్టుకుంటారు. తల్లికి పట్టాభిషేకం ,మన అమ్మ రూపానికి పట్టాభిషేకం జరిగింది. ఆ విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. నిన్న అద్భుతం జరిగింది అని అమ్మవారి వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న అని అందెశ్రీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version