SLBC టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం అయింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద SLBC సొరంగం కూలి 8 మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని గుర్తించగా.. తాజాగా రెస్క్యూ టీమ్ మరో మృతదేహాన్ని గుర్తించారు.

అయితే, అది ఎవరిది అనే విషయం తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం జరగ్గా, ప్రస్తుతం టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కాగా… SLBC టన్నెల్‌లో చిక్కుకున్న కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం అయింది.