Kakatiya University: కాకతీయలో తన్నుకున్న విద్యార్థులు..వీడియో వైరల్‌ !

-

వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య మళ్లీ ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటగ్రేటెడ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ డైనింగ్ హాల్‌లో కొట్టుకున్నారు. భోజనం చేస్తున్న సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చూస్తుండగానే.. ఇరువర్గాలు కొట్టుకోవడంతో రణరంగంగా మారింది డైనింగ్ హాల్.

students

అంతటితో ఆగకుండా.. హాస్టల్ ముందు పరస్పర దాడులకి దిగారు విద్యార్థులు. అయితే… వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య మళ్లీ ఘర్షణ చోటు చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. ఈ తరుణంలోనే.. రంగంలోకి దిగిన పోలీసులు.. దీనిపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version