3 విడతల్లో తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో స్థానిక ఎన్నికల కసరత్తు ప్రారంభం అయిందని సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే… గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ 10-02-2025గా నిర్ణయించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 24 -02 -2025మొదటి విడత ఎన్నికలు, 03-03-2025 రెండవ విడత ఎన్నికలు, 10-03-2025 మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారట.
21-03 -2025 నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న తరుణంలోనే.. ఆ లోపే 3 విడతల్లో తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే… తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొందట ఈసీ. తొలుత ZPTC, MPTC ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు.