ఖమ్మం జిల్లా లో మరో రైతు ఆత్మహత్యాయత్నం..!

-

ఖమ్మం జిల్లా లో మరో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళ వారం రోజున చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాను సాగు చేస్తున్న భూమి పైకి మరో వ్యక్తి వచ్చి ఆక్రమిస్తున్నట్టు రైతు ఆరోపణలు చేస్తున్నారు. రఘునాథ్ పల్లి మండలం రజాబ్ అలీ నగర్ కు చెందిన రైతు ప్రసాద్ (32) ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

Another farmer suiide attempt in Khammam district

సుమారు ఆరున్నర ఎకరాల భూమికి సంబంధించి ఓ కానిస్టేబుల్ తో వివాదం నెలకొందని సమాచారం అందుతోంది. అయితే… తాము సుమారు 15ఏళ్ళుగా పొడు సాగు చేసుకుంటున్న భూమిలో కానిస్టేబుల్ తన కూతురు పేరు మీద అక్రమంగా పట్టా తీసుకున్నడని ఆరోపిస్తున్నారు రైతు ప్రసాద్ కుటుంబ సభ్యులు. ఇక ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రైతు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version