తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త..

-

 

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీష్ రావు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్ లన్నీ ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. పరిగిలో స్థానిక ఎమ్మెల్యే అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మాట్లాడుతూ..9200 గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ ఈ నెలలో ఉంటుంది. అందరూ అన్ని పోస్టులకు పరీక్ష రాసేందుకు వీలుగా ఒక దాని తర్వాత మరొక నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించారు.

ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాము. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారన్నారు. పట్టు బట్టి, ఢిల్లీ పోయి ఒప్పించారు. 33 శాతం పోలీసు ఉద్యోగాలు మహిళలకు కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొన్న సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. లక్ష్యం సిద్ధించాలంటే, చిత్తశుద్దితో పని చేయాలి. బాగా చదవాలి. తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. వారి ఆశలు నిలబెట్టాలని వెల్లడించారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version