ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బి షాక్ తగిలింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ ఆదేశించింది. తనపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కు ఫిర్యాదు చేశారు హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్.

సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అంతకు ముందు కూడా సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.. కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకు సమన్లు జారీ చేసింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న మహిళా కార్పొరేటర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మహిళా కమిషన్ ఆగ్రహం చేసింది.