తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు

-

రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు వర్షాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు చిగురాకులా వణికిపోతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఈ వారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

ముఖ్యంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలకు తోడుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించింది. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version