ఏపీ ప్రజలకు శుభవార్త..ఇవాళ వారందరి ఖాతాల్లో డబ్బులు జమ !

-

ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ ఇవాళ సంక్షేమ పథకాల నిధులు జమ కానున్నాయి. విద్యా దీవెన, ఆసరా, ఈ బీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయకూడదని ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఇవాళ ఒక్కరోజు నీదుల విడుదలకు వెసులుబాటు కల్పించింది హైకోర్టు.

Ap High Court On Scheme Funds Release

సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిధుల విడుదల పై ఇవాళ వరకు స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు…. ఈ నెల 11 నుంచి 13 వరకు నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

నిధుల పంపిణీ విషయాన్ని ప్రచారం చేయవద్దని స్పష్టం చేసిన న్యాయస్థానం..కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఈసీకి ఆదేశాలు ఇచ్చింది. నిధుల విడుదలకు ఇవాళ ఒక్క రోజు ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చిన న్యాయస్థానం….నిధుల విడుదలలో రాజకీయ నేతల ప్రమేయం, సంబరాలు, ఆర్భాటాలు చేయవద్దని ఆదేశించింది. ఇక తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version