తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ కొంత మంది సిట్టింగ్ లకే టికెట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ టికెట్ల కోసం ఈ సారి కొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. టికెట్ల కోసం దామోదర కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీ రేపు పీసీసీకి నివేదిక ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ధరఖాస్తుదారులతో ప్రమాణ పత్రం తీసుకోనుంది కాంగ్రెస్. ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.50వేలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల దరఖాస్తుకు ఫీజు రూ.25వేలు నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గం ఎన్ని దరఖాస్తులు వస్తాయో అంచనా వేసి ఫైనల్ గా ఎవ్వరికీ టికెట్ కేటాయించాలనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. దరఖాస్తు చేసుకున్న తరువాత టికెట్ రాని వారికి వారి డబ్బులను రిటర్న్ ఇవ్వనున్నట్టు సమాచారం.