కేంద్రం వివిధ రకాల స్కీమ్స్ ని అందిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు తాజాగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఊరట కలిగే నిర్ణయం ని మోడీ తీసున్నారు. ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో ప్రకటన చేశారు. మహిళల కోసం స్వయం సహాయక గ్రూప్స్ లో ఉన్న మహిళలకు ఈ ప్రయోజనం కలుగుతుందని అన్నారు. స్వయం సహాయక గ్రూప్స్‌లో వాళ్లకి అగ్రి డ్రోన్స్ అందుబాటులో ఉంచుతామని ప్రధాని మోదీ అన్నారు.
వ్యవసాయ రంగం లో టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం కోసం ఇలా చేయనున్నారట. అగ్రి డ్రోన్స్ పొందితే.. వారికి ప్రభుత్వమే డ్రోన్ నడపడానికి శిక్షణ ఇస్తుందని ఆయన చెప్పారు. పైగా వాటిని రిపేర్ చేసే శిక్షణ కూడా ఇస్తారట. తొలిగా 15 వేల మంది మహిళలకు ఇస్తున్నట్టు చెప్పారు. అలానే కొత్త స్కీమ్ ని కూడా తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు పొందాలనుకునే వాళ్ళ కి ఈ స్కీమ్ బెనిఫిట్ కలగనుంది. లోన్స్ వడ్డీ కి సంబంధించి ఊరట కలిగించేలా ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకు వస్తోందట. ఇలా సొంత ఇంటి కల సాకారం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.