కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా కే కేశ‌వ‌రావు నియామ‌కం

-

ఇటీవ‌లే బీఆర్ఎస్ నుంచి  కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశ‌వ‌రావుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ఆయ‌న‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప‌బ్లిక్ అఫైర్స్ స‌ల‌హాదారుగా ఆయ‌న కొన‌సాగ‌నున్నారు. కే కేశ‌వ‌రావుకు కేబినెట్ హోదా క‌ల్పిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కడ్‌ను కలిసి స్వయంగా రాజీనామా లేఖ అందించారు. ఒకపార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేసినట్టు కేకే వివరించారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే స‌మ‌క్షంలో కేకే కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.కేకే పదవీకాలం ముగిసేందుకు ఇంకా రెండేండ్ల సమయం ఉన్నది. దీంతో పీసీసీ చీఫ్‌ పదవి ఆశించి భంగపడిన నేతలు, ఎంపీ ఎన్నికల్లో టికెట్‌ దక్కని సీనియర్‌ నాయకులు ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version