ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అలాగే విష్షు కుమార్ రాజు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అయితే మరోసారి గంటా శ్రీనివాస్ అలాగే విష్ణుకుమార్ రాజు మధ్య గ్యాప్ పెరిగినట్టు చెబుతున్నారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా వేలు ఎందుకు పెడుతున్నారు అంటూ గంటా శ్రీనివాస్ బహిరంగంగానే ఫైర్ అయినట్టు తెలుస్తోంది.
మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. అస్సలు సహించేది లేదని.. వార్నింగ్ కూడా ఇచ్చారట గంట శ్రీనివాస్. ఫిలింనగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని.. తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెల్తారు అంటూ విష్ణు కుమార్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్ అయినట్టు చెబుతున్నారు. ఇక ఈ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికీ తీసుకెల్లే సమయంలో మీరు అందుబాటులో లేరని.. గంటా శ్రీనివాస్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారట విష్ణు కుమార్.