కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం : డిప్యూటీ సీఎం భట్టి

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం కావస్తుండటంతో ఈ ఏడాది పాలన కాలంలో సాధించిన విజయాలపై పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. నవంబర్ 14 నుంచి కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాల పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు చురుకుగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ఉత్సవాల నిర్వహాన పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అయింది.

తాజాగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రమంతటా కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు జరపడానికి ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా నవంబర్ 14 నుంచి డిసెంబర్ 09 వరకు కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాల పేరుతో జరిపే ఉత్సవాల్లో ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నట్టు భట్టి విక్రమార్క తెలియజేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version